జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధికి చర్యలు 

22 Sep, 2021 12:57 IST|Sakshi

కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాశాఖ 

ఇస్రో మాజీ చీఫ్‌ కస్తూరిరంగన్‌ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్‌ కమిటీ 

కమిటీలో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌–ఛాన్సలర్‌ టి.వి కత్తిమణి 

మూడేళ్ళపాటు కమిటీ పదవీకాలం 

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం ఇస్రో మాజీ చీఫ్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్‌ కమిటీని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఏర్పాటు చేసింది. ఆయన గతంలో జాతీయ విద్యా విధానం–2020 డ్రాఫ్టింగ్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. కాగా మూడేళ్ళ కాలపరిమితితో నిర్ణయించిన ఈ నూతన కమిటీ జాతీయ విద్యావిధానం 2020 దృక్పథాల ప్రకారం నాలుగు జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను అభివృద్ధి చేస్తుంది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా, ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య కోసం జాతీయ పాఠ్యాంశాలు, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక, వయోజన విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను ఈ కమిటీలోని మొత్తం 12మంది సభ్యులు సిద్ధం చేయనున్నారు. 

ప్రతిపాదనలు.. సలహాలు.. 
ఎన్‌ఈపీ–2020 అన్ని సిఫార్సులను పాఠశాల విద్య, ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీసీఈ), టీచర్‌ ఎడ్యుకేషన్, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌కు సం బంధించిన  పాఠ్యాంశాల సంస్కరణలను ఈ కమి టీ ప్రతిపాదిస్తుంది. జాతీయ పాఠ్యాంశాల ముసా యిదా కోసం టెక్‌ ప్లాట్‌ఫారమ్‌లో అందుకున్న రాష్ట్ర పాఠ్యాంశాల ముసాయిదా నుంచి కమిటీ ఇన్‌పుట్‌లను తీసుకుంటుంది. అంతేగాక జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా తయారీలో వాటాదారులైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందుకున్న సలహాలతో పాటు ఎన్సీఈఆరీ్టకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, జనరల్‌ బాడీ, సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ సమా వేశాల్లో సూచనలను చేర్చిన తర్వాత కమిటీ జాతీ య పాఠ్యాంశాల ఫ్రేమ్‌వర్క్‌లను ఖరారు చేస్తుంది.  

పలువురు సభ్యులు.. 
జాతీయ స్టీరింగ్‌ కమిటీకి భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కె.కస్తూరిరంగన్‌ నేతృత్వం వహిస్తుండగా,  నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రస్తుత ఛాన్సలర్‌ మహేష్‌ చంద్ర పంత్, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌  గోవింద్‌ ప్రసాద్‌ శర్మ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి వైస్‌ ఛాన్సలర్‌ నజ్మా అక్తర్, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ మొదటి వైస్‌–ఛాన్సలర్‌ టి వి కత్తిమణి, పద్మశ్రీ మిచెల్‌ డానినో, జమ్మూ ఐఐఎం చైర్‌పర్సన్‌ మిలింద్‌ కాంబ్లే, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జగ్బీర్‌ సింగ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ గణిత శాస్త్రవేత్త మంజుల్‌ భార్గవ, ఎన్‌ఈపీ–2020 డ్రాఫ్ట్‌ కమిటీ సభ్యుడు ఎంకె శ్రీధర్, మాజీ ఐఏఎస్‌ అధికారి ధీర్‌ జింగ్రాన్, ఏక్‌ స్టెప్‌ ఫౌండేషన్‌ సీఈఓ శంకర్‌ మరువాడలు సభ్యులుగా వ్యవహరించనున్నారు. 

>
మరిన్ని వార్తలు