రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించండి: కేంద్రం సూచన

21 Dec, 2022 16:59 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: పలు దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. మన పొరుగు దేశంలో చైనాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో, ఆరోగ్యశాఖ మంత్రి మన్షుఖ్‌ మాండవీయా వైద్య నిపుణులు, అధికారులతో సమావేశమయ్యారు. 

ఈ సందర్బంగా కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కోరింది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి రాకపోకలపై ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అదుపులోకి ఉన్నాయని తెలిపింది. 

మన దేశంలో భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలో కేసులు పెరుగుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే, దేశంలో కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షించడానికి వారానికొకసారి సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు