‘కోవిడ్‌’పై అమిత్‌ షా సమీక్ష

23 Feb, 2021 03:09 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కేంద్ర వైద్య శాఖాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భళ్లాలు పాల్గొన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడంపై ఆయన పలు విషయాలు ఆరా తీశారు. కోవిడ్‌ను అడ్డుకునేందుకు ఆయా రాష్ట్రాల్లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాల్సిందిగా సూచించారు. ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి చేయదగ్గ సహాయాలను అందించాలని కోరినట్లు అధికారులు చెప్పారు. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,417 కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 19,94,947కు చేరుకుంది.

మరిన్ని వార్తలు