Umngot River In Meghalaya: ఇదేం వింత.. పడవ గాల్లో ఎగరడం ఏంటి..!?

17 Nov, 2021 12:32 IST|Sakshi

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఫోటో

ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న ఉంగోట్‌ నది

Meghalaya Cleanest Umngot River Images: ఇక్కడ ఉన్న ఫోటో చూడగానే ఏమనిపిస్తుంది.. పడవ ఏంటి గాల్లో ఎగురుతుంది.. ఇదేలా సాధ్యం అని ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి బాహుబలి చిత్రం గుర్తుకు వస్తుంది. కాసేపు పరీక్షగా చూస్తే.. ఆశ్చర్యంతో మన కళ్లు పెద్దవి అవుతాయి. అబ్బ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో కదా.. ఎక్కడబ్బా.. ఇంత పరిశుభ్రమైన.. స్వచ్ఛమైన నది.. ఓ సారి వెళ్లి చూసి వస్తే బాగుండు అనిపిస్తుంది. 

Meghalaya Umngot River

నది అడుగు భాగంలో ఉన్న ప్రతి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత స్వచ్ఛంగా ఉందంటే.. పడవ ఏదో అద్దం మీద ఉన్నట్లుంది. ఇంత స్వచ్ఛమైన నది ఏ దేశంలో ఉందో కదా అని ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంత అందమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన నది మన దేశంలోనే ఉంది. ఈ ఫోటోని కేంద్ర జలశక్తి వనరుల శాఖ ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 
(చదవండి: లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!)

Umngot River In Meghalaya Viral Images

కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం తన ట్విటర్‌లో ఈ నది ఫోటో షేర్‌ చేసింది. ‘‘ప్రపంచలోని అత్యంత స్వచ్ఛమైన నదుల్లో ఇది ఒకటి. భారతదేశంలోనే ఉంది. మేఘాలయ రాష్ట్రం, షిల్లాంగ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉంగోట్ నది. నదిలో పడవ మీద వెళ్తున్న ఫోటో చూస్తే.. అది గాల్లో తేలుతుందేమో అనిపిస్తుంది. ఈ నదిలో నీరు చాలా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటాయి. దేశంలోని నదులన్ని ఇలా ఉండాలని ఆశిస్తున్నాను. హ్యాట్సాఫ్‌ మేఘలయ ప్రజలు’’ అంటూ ట్వీట్‌ చేసిన ఈ ఫోటో గంటల వ్యవధిలోనే వైరలయ్యింది. 
(చదవండి: దుర్గం చెరువు: విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్‌!)

Umngot River Photos

ఇది చూసిన నెటిజనులు.. ‘‘భారత దేశంలో ఇంత స్వచ్ఛమైన నది ఉందంటే నమ్మబుద్ది కావడం లేదు.. యమునా నది ఎప్పుడు ఇంత సుందరంగా మారుతుంది... గంగా నది మాట ఏంటి.. ఏది ఏమైనా నదిని పదిలంగా కాపాడుకుంటున్న మేఘలాయ ప్రజలకు ధన్యవాదాలు’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటి వరకు ఈ ఫోటోకి 19 వేలకు పైగా లైక్‌లు, 3 వేల రీట్వీట్‌లు వచ్చాయి.

చదవండి: సినిమా సెట్టింగో.. స్పెషల్‌ ఎఫెక్టో అనుకుంటున్నారా..!

మరిన్ని వార్తలు