కేంద్రమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న అధికారులు..

16 Apr, 2022 18:21 IST|Sakshi

లక్నో: కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అంబేద్క‌ర్ జయంతి కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కేంద్ర మంత్రికి ప్ర‌మాదం త‌ప్పింది. వేడుకల్లో వేదిక కూలిపోవడంతో ఫ్లడ్‌ లైట్లు వేదికపైనున్న నేతపై పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల ప్రకారం...  ఆగ్రాలో అంబేద్క‌ర్ జయంతి వేడుకల కార్య‌క్ర‌మానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్‌ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వేదికపైన ఎక్కువ మంది ఉండటంతో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. దీంతో ఫ్లడ్‌ లైట్లు అక్కడున్న నేతలపైన పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

కాగా, ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రికి తృటిలో ప్రమాదం తప్పింది. స్ధానిక పోలీసులు, భ‌ద్ర‌తా సిబ్బంది కింద‌ప‌డిన ఆయ‌న‌ను పైకిలేపారు. ఆయనకు గాయాలేవీ కాకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, వేదికపైన ఎక్కువ మంది ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు