లోక్‌సభలో అలజడి ఘటన: ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్

16 Dec, 2023 13:44 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంట్ అలజడి ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తప్పుబట్టారు. మహ్మద్ అలీ జిన్నా భావజాలంతో ఓవైసీ ప్రభావితమయ్యారని విమర్శించారు. జిన్నా ఆత్మ ఓవైసీలోకి చొరబడిందని వ్యగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయన ఓ వర్గం కోసమే పనిచేస్తారని అన్నారు. నేరస్థుల్లో కూడా మతకోణం చూడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

లోక్‌సభలో భద్రతా వైఫల్యం కేసుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల మతం, కులం, విశ్వాసాలతో పట్టింపులేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మతపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే గుర్తించామని తెలిపారు. పార్లమెంట్‌లో అలజడి కేసులో నిందితులు ముస్లింలు అయితే పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు అడగడంపై ఆయన ఆక్షేపించారు. 

  ఉగ్రవాద అంశంలో ప్రతిపక్షాలు మత కోణాన్ని చూస్తున్నారు.. ఈ అంశంపై  హోమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబడుతున్నారు.. ఇలాంటి విషయాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారిపోయేవారు కాదు అని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. దృఢ సంకల్పంతో ప్రతిస్పందించే వ్యక్తి అని తెలిపారు. పార్లమెంటు చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఏఐఎంఐఎం, కాంగ్రెస్  ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. 

ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు

>
మరిన్ని వార్తలు