బీజేపీతో టచ్‌లో 45మంది టీఎంసీ ఎమ్మెల్యేలు: కేంద్ర మంత్రి

5 Dec, 2022 12:41 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష నేతల మాటలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత నిశిత్‌ ప్రమానిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)కి చెందిన 40-45 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కీలక పరిణాణాలు చోటు చేసుకోనున్నాయని తెలిపారు. అంతకు ముందు బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అరెస్ట్‌ కాబోతోందని, 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. 

కూచ్‌ బెహర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమం వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్‌ ప్రమానిక్‌. తృణమూల్‌ కాంగ్రెస్‌ పునాదులు బలహీనంగా మారాయని ఆరోపించారు. ‘తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత పునాదులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇసుక మేటల వలే ఉన్నాయి. పేకమేడలా ఎప్పుడైనా కూలిపోవచ్చు. అది మాకు అర్థమవుతోంది. బెంగాల్‌ ప్రజలకు సైతం తెలుసు. 40 నుంచి 45 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. భవిష్యత్తులో ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.

ఇదీ చదవండి: పార్లమెంట్‌లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు