కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి అస్వస్థత

17 Nov, 2022 15:25 IST|Sakshi

కోల్‌కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో గురువారం హైవేల శంకుస్థాపనకు వెళ్లిన గడ్కరీ.. దగాపూర్‌ మైదానం వేదికపై ఉండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యక్రమాన్ని ఆపేశారు. కేంద్ర మంత్రిని విశ్రాంతి కోసం పక్కనన్న గ్రీన్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స అందించారు.

సిలిగురి నుంచి డాక్టర్‌ను పిలిపించారు. ఈ మేరకు ఆయనను పరీక్షించిన వైద్యులు బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గినట్టు తెలిపారు. వైద్యుల సూచనతో సెలైన్‌ ఎక్కించారు. డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్ గడ్కరీని కారులో తన నివాసానికి తీసుకెళ్లారు. మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం రాజు బిస్తా నివాసానికి చేరుకుంది.

కాగా రూ. 1,206 కోట్ల విలువైన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వెళ్లారు. ఈలోపే సిలిగురిలో అస్వస్థతకు లోనయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ కార్యక్రమం  ముగిసిన తర్వాత గడ్కరీ దల్ఖోలాకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌ రద్దు అయినట్లు తెలుస్తోంది. సిలిగురి నుండి అయన నేరుగా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. 
చదవండి: తొలిసారిగా.. 45 ఏళ్ల రాజకీయ చరిత్రకు బ్రేక్‌

మరిన్ని వార్తలు