కృష్ణంరాజు కుటుంబానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శ

16 Sep, 2022 15:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన నేరుగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అ‍క్కడ కృష్ణంరాజు సతీమణి శ్యామల, ఆయన కుమార్తెలు, ప్రభాస్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మృతిపట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

అనంతరం క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆయన వెంట ఉన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

చదవండి: (ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు