ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’కి నో ఎంట్రీ

15 Dec, 2022 06:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ముందస్తు అనుమతిలేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం బుధవారం వెల్లడించింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్‌ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్రసింగ్‌ సభలో పేర్కొన్నారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంతో బేదాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలను చూపుతూ కొన్ని రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతికి నిరాకరించిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని కేంద్రం బుధవారం పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడించింది.

ఇదీ చదవండి: Tawang dominates Parliament: ‘చైనా’పై చర్చించాల్సిందే

మరిన్ని వార్తలు