ఇన్‌స్టాగ్రామ్‌లో స్మృతి ఇరానీ సలహాలు తెగ వైరల్‌

23 Jul, 2021 20:41 IST|Sakshi
ఫొటో: smritiiraniofficial Instagram

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి జుబిన్‌ ఇరానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో విభిన్న అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా శుక్రవారం చేసిన ఓ పోస్టులు తెగ వైరలయ్యాయి. తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. పెళ్లి కావాల్సిన వారికి సలహాలు ఇచ్చారు. ఆంటీ ఇచ్చే సలహా అంటూ తనకు తాను ఆంటీగా అభివర్ణించుకోవడం స్మృతి ఇరానీకే చెల్లింది. ఎవరైనా ఆంటీ అంటే ఊరుకోరు కానీ స్మృతి ఇరానీ ఆంటీ అనిపించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఆమె పోస్టులు ఇలా ఉన్నాయి.

‘ఏ వ్యక్తికైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్‌ చాలా నెమ్మదిగా (స్లో) ఉండే కంప్యూటర్‌ ముందు కూర్చోబెట్టాలి. దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవచ్చు’ అని ఓ పోస్టు చేశారు. అనంతరం మరో పోస్ట్‌ చేశారు. ‘ఆంటీ సలహా.. ఏ పదార్థం పరిపూర్ణం.. లోపం లేనిది (పర్ఫెక్ట్‌)గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి’ అని సలహాలు ఇస్తూ పోస్టు చేశారు. ఈ పోస్టులపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ ఉన్న విషయం తెలిసిందే. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో స్మృతిని కొనసాగించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు