దేశ సంపదను ధ్వంసం చేయకండి: రైల్వే మంత్రి విజ్ఞప్తి

17 Jun, 2022 17:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ నిరసనల్లో భారత రైల్వే వ్యవస్థ దెబ్బ తింటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ తరుణంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. 

‘‘యువతకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. నిరసనలను హింసాత్మక మార్గంలో వెళ్లనివ్వకండి. రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేయకండి. రైల్వేస్‌ దేశానికి ఆస్తి’’ అని జాతీయ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారాయన.

ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా జరిగిన అగ్నిపథ్‌ నిరసనల్లో పలు రైళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. అలాగే పదుల సంఖ్యలో రైళ్లను ధ్వంసం చేశారు. కోట్ల విలువైన రైల్వే ఆస్తులను నాశనం చేయడంతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు నిరసనకారులు.

మరిన్ని వార్తలు