దేశంలో 25కు చేరిన యూకే స్ట్రెయిన్‌ కేసులు

31 Dec, 2020 11:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తరకం కరోనా క్రమక్రమంగా విస్తరిస్తోంది. దేశంలో తాజాగా మరో ఐదుగురికి యూకే స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ సోకింది. పూణేలో నలుగురికి , ఢిల్లీలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో మొత్తంగా యూకే స్ట్రెయిన్‌ కరోనా కేసుల సంఖ్య 25కు చేరింది. బాధితులందరినీ ప్రత్యేక అబ్జర్వేషన్లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా మంగళవారం 6, బుధవారం 14 కరోనా కొత్తరకం కేసులు బయటపడిన విషయం తెలిసిందే. (చదవండి: భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కలకలం..)

ఇదిలా ఉండగా.. భారత్‌లో కొత్తగా 21,821 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. 299 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తంగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,266,674కు చేరగా, కరోనా మరణాల సంఖ్య 148,738గా నమోదైంది. చదవండి: అలర్ట్‌: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్‌ వద్దు

మరిన్ని వార్తలు