Boris Johnson India Tour: బ్రిటన్‌ ప్రధానితో విదేశాంగ మంత్రి భేటీ

22 Apr, 2022 13:43 IST|Sakshi

TIME 01:30PM
ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సమక్షంలో భారత్‌-యూకే మధ్య వివిధ ఒప్పందాలు జరిగాయి. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన చారిత్రాత్మకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై(ఎఫ్‌టీఏ) పని చేస్తున్నాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎఫ్‌టీఏను ముగించేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో రక్షణ రంగం, వాణిజ్యం, వాతావరణం, ఇంధన భద్రతపై చర్చలు జరిగాయని నరేంద్ర మోదీ తెలిపారు. అదే విధంగా ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతంలో భద్రత పరంగా సహకారాన్ని అందించుకోవడంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. కాగా గతేడాది భారత్‌-యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించామని తెలిపిన ప్రధాని మోదీ ఎఫ్‌టీఏకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

TIME 01:00PM
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బోరిస్ జాన్సన్ భారత్‌ను తమ స్నేహితుడిగా అర్థం చేసుకున్నాడని అన్నారు.

TIME 12:00PM
ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతంలో భద్రత పరంగా సహకారాన్ని అందించుకోవడం, ఇరు దేశాల మధ్య దౌత్య ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై రెండు దేశాల ప్రధానులు చర్చించుకోనున్నారు. అలాగే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్‌ సమావేశమయ్యారు.

TIME 11:00AM
బ్రిటన్‌ ప్రధానికి కలుసుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.  సుధీర్ఘకాలంగా ఎదురుచుస్తున్న నా స్నేహితుడు @ బోరిస్‌ జాన్సన్‌కు ఇండియాలో చూడటం చాలా అద్భుతంగా ఉంది.  చర్చలు కోసం ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. మోదీని కలవక ముందు.. నా స్నేహితుడితో సమావేశమయ్యేందుకు ఎదురు చూస్తున్నానని బోరిస్‌ ట్వీట్‌ చేశారు. నిరంకుశ రాజ్యాల నుంచి పెరుగుతోన్న బెదిరింపు వేళ.. వాతావారణ మార్పులు, ఇంధన భద్రత, రక్షణ వంటి అంశాల్లో మన ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం ముఖ్యమంటూ పేర్కొన్నారు. 

TIME 10:00AM
►బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు అద్భుత స్వాగతం పలికినందుకు మోదీకి బ్రిటన్‌ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.. ‘భారత్- యూకే మధ్య పరిస్థితులు ఇంతకముందు కంటే ఇప్పుడు మరింత బలంగా, మంచిగా ఆన్నాయి’ అని బోరిస్ జాన్సన్ అన్నారు.

న్యూఢిల్లీ: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్‌ వద్ద బోరిస్‌కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి రాజ్‌ఘట్‌ చేరుకున్నారు. వాస్తవానికి గత ఏడాదిన్నర కాలంలోనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ భారత పర్యటనకు రావాల్సి ఉండగా.. కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాల నేపథ్యంలో పర్యటన వాయిదాపడుతూ వచ్చింది. 

మరిన్ని వార్తలు