అన్‌లాక్‌ 4.0: స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకోవు!

25 Aug, 2020 19:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా అన్‌లాక్‌ చేస్తూ వస్తుంది. వచ్చే వారంలో అన్‌లాక్‌ 4.0 ప్రక్రియ మొదలు కానుంది. తాజాగా ఈ విషయానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరణనిచ్చారు. కేంద్ర హోంశాఖ ప్రకటించబోయే సడలింపులలో స్కూళ్లు ఉండవబోవని వెల్లడించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ఈ క్రమంలో కేం‍ద్ర ప్రభుత్వానికి పాఠశాలలు తెరిచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. (24 గంటల్లో.. 60,975 కరోనా కేసులు)

అదేవిధంగా మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక రాష్ట్రాల నుంచి మెట్రో సేవలపై డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులు, బస్సులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సినిమా థియేటర్లు, బార్లు  తెరవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కంటైన్‌మెంట్‌ జోన్లలలో ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి. అన్‌లాక్‌ 4.0లో ఆంక్షలు వేటిపై ఉన్నాయన్న దానిని మాత్రమే కేంద్ర హోం శాఖ వివరించింది. 

చదవండి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌


 

>
మరిన్ని వార్తలు