-

Unlock: జూన్‌ 21 నుంచి మాల్స్‌, రెస్టారెంట్లు ఓపెన్‌!

18 Jun, 2021 14:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటకలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

5,983 కేసులు, 138 మరణాలు  

ఈనెల 21 నుంచి మాల్స్‌, రెస్టారెంట్లు తెరవచ్చు

సాక్షి, బెంగళూరు: కరోనా నిర్బంధంతో విసిగిపోయిన వారికి శుభవార్త. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో మాల్స్‌, రెస్టారెంట్లు, కళ్యాణ మండపాలు, స్పా, సెలూన్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్సులను ఈనెల 21 నుంచి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే అధిక సంఖ్యలో జనం చేరకుండా చూడాలని ఆదేశించింది. కరోనా సాంకేతిక సలహా సమితి ఈ మేరకు పలు సిఫారసులు చేసింది.

కరోనా నిబంధనల నేపథ్యంలో అన్నిచోట్లా 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. ఇంకా కోవిడ్‌ బెడద ఉన్నందున రెండు వారాల తర్వాతే జిమ్‌, యోగా సెంటర్లు, దేవస్థానాలు, సినిమా టాకీస్‌లు తెరవడానికి ఆమోదించాలని సర్కారుకు తెలిపింది. 21వ తేదీ తరువాత బీఎంటీసీ బస్సులు, మెట్రో రైళ్ల సంచారంపై నిర్ణయం తీసుకోనున్నారు.

మరికాస్త దిగువకు కరోనా
కరోనా మహమ్మారి మరింత అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 5,983 మందికి సోకింది. మరో 138 మంది మృత్యువాత పడ్డారు. 10,685 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం కరోనా కేసులు 27,90,338 కి, డిశ్చార్జ్‌లు 26,10,157 కి చేరాయి. ప్రాణనష్టం 33,434 కి పెరిగింది. 1,46,726 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 1,58,442 నమూనాలు పరీక్షించారు. మరో 1,46,236 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు.  
బెంగళూరులో 1,209 కేసులు  
బెంగళూరులో తాజాగా 1,209 కేసులు, 1,510 డిశ్చార్జిలు, 17 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12,01,963కు పెరిగింది. అందులో 11,07,648 మంది కోలుకున్నారు. ఇంకో 15,371 మంది మరణించారు. 78,943 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. 

చదవండి: బెంగళూరు: పీజీలపై కరోనా పిడుగు... ఎటుచూసినా ఖాళీ


 

మరిన్ని వార్తలు