ఐఈఎస్‌/ ఐఎస్‌ఎస్‌–2021

22 Apr, 2021 17:29 IST|Sakshi

మొత్తం పోస్టుల సంఖ్య 26 

దరఖాస్తులకు చివరి తేది 27.04.2021

యూపీఎస్సీ నోటిఫికేషన్‌

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, అనుబంధ విభాగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(ఐఈఎస్‌)/ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌(ఐఎస్‌ఎస్‌)–2021 ప్రకటన వెలువడింది. దీనిద్వారా ఐఈఎస్‌లో 15 పోస్టులు, ఐఎస్‌ఎస్‌లో 11 పోస్టులు భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ ఏటా ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌–2021కు సంబంధించి అర్హతలు,ఎంపిక విధానం వివరాలు..

అర్హతలు
► ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(ఐఈఎస్‌): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌/అప్లయిడ్‌ ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌/ఎకనోమెట్రిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణత ఉండాలి. 

   

► ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ (ఐఎస్‌ఎస్‌): స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటికల్‌  స్టాటిస్టిక్స్‌/అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఆయా సబ్జెక్టుల్లోని ఒకదానిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: 01.08.2021 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1991 నుంచి 01.08.2000 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం
రాత పరీక్ష, వైవావాయిస్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షకు 1000 మార్కులు, వైవా వాయిస్‌కు 200 మార్కులు కేటాయించారు. ఆఫ్‌లైన్‌లో(పెన్‌ అండ్‌ పేపర్‌) విధానంలో పరీక్ష జరుగుతుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని వైవా వాయిస్‌కు పిలుస్తారు. మొ త్తంగా 1200 మార్కులకు అభ్యర్థులు సాధించిన స్కోర్‌ ఆధారంగా, రిజర్వేషన్లను అనుసరించి తుది ఎంపిక జరుగుతుంది.


పరీక్ష విధానం
► ఐఈఎస్‌ పరీక్షలో.. మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. అన్నీ డిస్క్రిప్టివ్‌ పేపర్లే. జనరల్‌ ఇంగ్లిష్‌ 100 మార్కులు, జనరల్‌ స్టడీస్‌ 100 మార్కులు, జనరల్‌ ఎకనామిక్స్‌ 1కు 200 మార్కులు, జనరల్‌ ఎకనామిక్స్‌ 2కు 200 మార్కులు, జనరల్‌ ఎకనామిక్స్‌3కి 200 మార్కులు, ఇండియన్‌ ఎకనామిక్స్‌ పేపర్‌ 200 మార్కులకు ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం 3గంటలు. ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్‌లో ఉంటాయి. సమాధానాలు కూడా ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది. 

► ఐఎస్‌ఎస్‌ పరీక్షలో.. మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. జనరల్‌ ఇంగ్లిష్‌ 100 మార్కులు, జనరల్‌ స్టడీస్‌ 100 మార్కులు, స్టాటిస్టిక్స్‌–1(ఆబ్జెక్టివ్‌)–200 మార్కులు, స్టాటిస్టిక్స్‌–2(ఆబ్జెక్టివ్‌)–200 మార్కులు, స్టాటిస్టిక్స్‌–3(డిస్క్రిప్టివ్‌)–200 మార్కులు, స్టాటిస్టిక్స్‌–4(డిస్క్రిప్టివ్‌)–200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ పేపర్లకు పరీక్ష సమయం రెండు గంటలు, డిస్క్రిప్టివ్‌ పేపర్లకు మూడు గంటల సమయం కేటాయించారు. 

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తులకు చివరి తేది: 27.04.2021
► పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మిగితా అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాలి. 
► పరీక్ష తేదీలు: జూలై 16 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
► ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం https://www.upsconline.nic.in

మరిన్ని వార్తలు