కరోనా ఎఫెక్ట్‌: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ వాయిదా

13 May, 2021 16:22 IST|Sakshi

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దేశంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. యూపీఎస్సీ ప్రకటించిన విధంగా జూన్‌ 27న ప్రిలిమినరీ పరీక్షలు జరగాల్సి ఉండగా, కరోనా కారంణంగా ఆక్టోబర్‌ 10న నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌తో పాటు ఇతర కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూ మూడు దశల్లో పరీక్షను నిర్వహిస్తున్న సంగతి  తెలిసిందే.

( చదవండి: అగ్రి స్టార్టప్స్‌.. దున్నేస్తున్నాయ్‌! )

>
మరిన్ని వార్తలు