వ్యాక్సిన్‌పై పుకార్లను నమ్మకండి: కేంద్రం

19 Jan, 2021 20:24 IST|Sakshi

ఢిల్లీ : మొన్నటివరకు కరోనాకు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందనే ఆందోళన ఉంటే, ప్రస్తుతం టీకా ఎంతమేర సురక్షితం అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. టీకా అందుబాటులోకి రాగానే మొదట ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కే ఇస్తామని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు కొందరు వైద్యసిబ్బంది వెనకడుగు వేస్తుండటంపై కేంద్రం జోక్యం చేసుకుంది. టీకా గురించి భయపడాల్సిన అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని కోరింది. కరోనా వంటి మహమ్మారికి వ్యాక్సిన్‌తోనే అడ్డుకట్ట వేయగలమని, వ్యాక్సిన్‌ విషయంలో ఎలాంటి సంశయం అవసరం లేదని పేర్కొంది. టీకా తీసుకున్న అనంతరం చాలా కొద్దిమందిలోనే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించాయని, అయితే ఇది సాధారణ విషయమని నీతి అయోగ్‌ డైరెక్టర్లలో ఒకరైన వీకె పాల్‌ పేర్కొన్నారు. ఒకవేళ తీవ్ర స్థాయిలో ప్రతికూలతలు ఎదురైతే వెంటనే చికిత్స అందించడానికి ప్రతీ సెంటర్లలోనూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. (కోవాగ్జిన్‌ టీకా వేసుకున్న వారిలో దుష్ప్రభావాలు )

కరోనా మమహ్మారిపై పోరాటంలో ముందుండి నడిపించిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌.. వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలోనే రోల్‌ మోడల్‌గా నిలవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా  అర్హులైన ప్రతీ ఒక్కరూ టీకా వేయించుకోవాలని విఙ్ఞప్తి చేశారు. భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు 3.8 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వారిలో 580 మందిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించగా, ఏడుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఇద్దరు మరణించారు. అయితే ఇది వ్యాక్సిన్‌కి సంబంధించి మరణాలు కాదని వైద్యులు నిర్ధారించారు. ఏడుగురు ఆసుపత్రి పాలవగా, ఇద్దరు మరణించారు. అయితే ఇది వ్యాక్సిన్‌కి సంబంధించినది కాదని కేంద్ర ప్రభుత్వం​ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,064 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలలుగా నమోదవుతున్న వాటిలో ఇదే అత్యల్పం. ఇప్పటివరకు దేశంలో 1.05 కోట్ల మందికి కరోనా సోకగా,  1,52,556 మరణాలు నమోదయ్యాయి. (వ్యాక్సినేషన్‌ తర్వాత ఇద్దరు మృతి! )


 

Poll
Loading...
మరిన్ని వార్తలు