PM Modi: మా అభివృద్ధి ఆడంబరం మాత్రం కాదు.. సాధికారికతే: ప్రధాని మోదీ

7 Jul, 2022 19:32 IST|Sakshi

వారణాసి: బీజేపీ హయాంలో అభివృద్ధి అనేది కేవలం ఆడంబరం మాత్రమే కాదని.. చేతల్లోనూ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో మహా వంటశాలను గురువారం ప్రధాని మోదీ ప్రారంభించారు. లక్ష మందికి వంట చేయగల సామర్థం ఉన్న మెగా కిచెన్‌ను.. వారణాసిలోని ఎల్టీ కళాశాలలో ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా దృష్టిలో అభివృద్ధి అంటే.. పేదలు, అణగారిన, వెనుకబడిన, గిరిజన, తల్లులు మరియు సోదరీమణుల సాధికారత అని ప్రధాని మోదీ ప్రకటించారు. అర్హులైన వాళ్లకు పక్కా ఇళ్లు, ప్రతీ ఇంటికి మంచి నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. 
 
అక్షయ పాత్ర సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ సంస్థ ఈ యంత్ర సహిత వంటశాల ద్వారా 150 పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇలాంటి భారీ సామర్థ్యం ఉన్న కిచెన్ లతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజల మధ్య ఉండడం తనకెప్పుడూ సంతోషం కలిగిస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు