చైనాకు చెక్‌ పెట్టేలా... భారత్‌కి అమెరికా అండ

15 Jul, 2022 16:42 IST|Sakshi

US House of Representatives has passed by voice vote: చైనా వంటి దురాక్రమణ దారులకు అడ్డుకట్టవేసేలా రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేలా భారత్‌కి అమెరికా మద్దతు ఇచ్చింది. ఈ మేరకు యూఎస్‌కి సంబంధించిన కాట్సా వంటి శిక్షార్హమైన ఆంక్షల చట్టానికి వ్యతిరేకంగా భారత్‌కి మినహయింపును ఇచ్చే శాసన సవరణను  యూఎస్‌ ప్రతినిధులు సభ వాయిస్‌ ఓటు ద్వారా ఆమోదించింది. నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌(ఎన్‌డీఏఏ) పరిశీలనకు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభ ఎన్‌బ్లాక్‌ సవరణలో భాగంగా ఈ శాసన సవరణను ఆమోదించింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధి భారత అమెరికన్‌ రో ఖన్నాప్రవేశ పెట్టిన ఈ సవరణ.. చైనా నుంచి తమను తాము రక్షించుకునేలా భారత్‌కి అండగా ఉండేలా ఈ అమెరికా చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని బైడెన్‌ పరిపాలన యంత్రాంగాన్ని కోరింది.

ఈ నేపథ్యంలోనే భారత్‌కి యూఎస్‌ కఠిన చట్టం నుంచి మినహియింపు ఇచ్చేలా ప్రవేశ పెట్టిన సవరణకు ఆమెదం లభించింది. భారత్‌ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల కోసం చేసిన యూఎస్‌ ఆమోదించిన ఈ సవరణ చట్టం అతి ప్రాముఖ్యతను సంతరిచంకుంటుందని కూడా అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు  రో ఖన్నా అన్నారు. వాస్తవానికి కాట్సా అనేది కఠినమైన యూఎస్‌ చట్టం. ఇది 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం, 2016 యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం తదితర కారణాల రీత్యా రష్యా నుంచి ఆయుధాలను  కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేలా ఈ కఠినమైన చట్టాన్ని 2017లో అమెరికా తీసుకువచ్చింది.  

దీంతో రష్యా రక్షణ ఇంటెలిజెన్స్ రంగాలతో లావాదేవీలు జరుపుతున్న ఏ దేశంపైనైనా యూఎస్‌ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా శిక్షాత్మక చర్యలను తీసుకుంటుంది. అక్టోబర్ 2018లో ఎస్‌400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల ఐదు యూనిట్లను కొనుగోలు చేయడానికి రష్యాతో భారత్‌ 5 బిలియన్‌ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఐతే ఈ ఒప్పందంతో ముందుకు సాగడం భారత్‌కి అసాథ్యం అని యూఎస్‌ శిక్షర్హమైన చట్టానికి సంబంధించిన ఆంక్షలు వర్తిస్తాయంటూ అప్పటి ట్రంప్‌ ప్రభుత్వం హెచ్చరించింది కూడా. అదీగాక ఇప్పటికే ఎస్‌ 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్‌కి భయాలు అధికమయ్యాయి. ఐతే ఈ శాసన సవరణను యూఎస్‌ ఆమోదించడంతో ప్రస్తుతం భారత్‌కి కాస్త ఊరట లభించింది.

(చదవండి: తీవ్ర దుఃఖంలో ట్రంప్‌.. భార్య మృతితో భావోద్వేగ సందేశం)

>
మరిన్ని వార్తలు