మేం ఇంటికి వెళ్లం.! జైల్లోనే బాగుంది, పిల్లాడిలా మారం చేస్తున్న ఖైదీలు

30 May, 2021 15:51 IST|Sakshi

పేరోల్ పై ఖైదీల విడుద‌లకు సుప్రీం అనుమతి

క‌రోనా దెబ్బ‌కు జైల్లో ఉంటామంటున్న ఖైదీలు 

ల‌క్నో: కరోనా విపత్కాలంలో మ‌ధ్యంత‌ర బెయిల్ ద్వారా జైలు నుంచి భ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఖైదీలు భ‌య‌ప‌డుతున్నారు. మీరు కోటి రూపాయిలు ఇచ్చినా స‌రే  మేం ఇంటికి వెళ్లం..! జైల్లోనే బాగుందంటూ ఖైదీలు పిల్లాడిలా మారం చేస్తున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు దేశంలో ప‌లు జైళ్ల‌లో శిక్ష‌ను అనుభవిస్తున్న ఖైదీల‌ను జైళ్ల శాఖ అధికారులు పేరోల్ మీద విడుద‌ల చేస్తున్నారు. అయితే ఉత్త‌ర్ ప్ర‌దేశ్లో ఉన్న 9 జైళ్ల‌లో 10,123 మంది ఖైదీలు బెయిల్ , పెరోల్‌పై విడుదల‌య్యారు.

 ట్రయల్స్ కింద 8,463 మందిని మధ్యంతర బెయిళ్లపై విడుదల చేయగా, 1,660 మంది దోషులకు 60 రోజుల పెరోల్ ఇచ్చారు. ఘజియాబాద్ జిల్లా జైలు నుంచి అధిక సంఖ్యలో 703 మంది అండ్రీడియల్స్ బెయిల్‌పై విడుదల కాగా,  కాన్పూర్ జిల్లా జైలులో 78 మందికి పెరోల్ ఇచ్చారు. అయితే చాలా మంది ఖైదీలు జైలు నుంచి మ‌ధ్యంత‌ర బెయిల్ పై విడుద‌లయ్యేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని యూపీ జైళ్ల‌శాఖ డీజీ ఆనంద్ కుమార్ తెలిపారు. " రాష్ట్రంలో  21 మంది దోషులు పెరోల్ నిరాకరించారు. ఆయా జిల్లాల్లో న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల‌కు భ‌య‌ప‌డి విడుద‌లయ్యేందుకు ఇష్ట ప‌డ‌డం లేదు. అయినా స‌రే జైళ్ల‌లో  క‌రోనా నిబంధ‌న‌ల్ని పాటిస్తూ ప్ర‌తి ఖైదీని జాగ్ర‌త్తగా చూసుకుంటున్న‌ట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు