యూపీలో దేవతకు నాలుక సమర్పణ

11 Sep, 2022 07:12 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భక్తి పారవశ్యంలో మునిగిన ఓ భక్తుడు ఏకంగా నాలుక తెగ్గోసుకున్నాడు! కౌషాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్‌.. మెహందీగంజ్‌లోని మాతా శీతలాదేవి మందిరానికి భార్యతో కలిసి వెళ్లాడు. ఆలయదర్శనానికి ముందు గంగానదిలో పుణ్యస్నానం చేశాడు. తర్వాత బ్లేడుతో తన నాలికను కత్తిరించుకుని ఆలయ ద్వారం వద్ద సమర్పించాడు.

నాలుక తెగడంతో కొద్దిసేపటికే సంపత్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కరా ధామ్‌ పోలీస్‌స్టేషన్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ అభిలాష్‌ తివారీ చెప్పారు. ఇంత పని చేస్తాడనుకోలేదంటూ భార్య వాపోతోంది.
చదవండి: అదర్‌ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ

మరిన్ని వార్తలు