వింత ఘటన: కోడి పుంజుకి దశదిన కర్మ... ఏకంగా 500 మందికి భోజనాలు

23 Jul, 2022 13:11 IST|Sakshi

ఇటీవల కాలంలో వింతవింత ఆచారాలను చూస్తున్నాం. కొంతమంది తమ పెంపుడు జంతువులు చనిపోతే వాటికి అంత్యక్రియలు నిర్వహించడం వంటివి చేస్తుండటం విన్నాం. కొంతమంది వాటిపై  ప్రేమకొద్ది సమాధులు కట్టించడం వంటివి చేయడం కూడా చూశాం. ఏదో మనుషులు చనిపోతే చేసే తతంగాలన్నింటికి  చేయడమే కాక భోజనాలు పెట్టడం గురించి విన్నమా? లేదుకదా! కానీ ఇక్కడోక కుటుంబం అలానే చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌లోని ఒక కుటుంబం తమ​ పెంపుడు కోడి పుంజు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా మనుషులు చనిపోతే చేసినట్లు అన్ని తతంగాలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆ కోడి పుంజు ఆ కుటుంబం పెంచుకుంటున్న ఒక నెల వయసున్న గొర్రెపిల్లను వీధి కుక్కల భారి నుంచి ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఐతే ఆ క్రమంలో ఆ కోడిపుంజు తీవ్రంగా గాయపడటంతో వెంటనే చనిపోయింది. దీంతో ఆ కోడి పుంజుకి మనిషి చనిపోతే ఎలా చేస్తారో అలా అంత్యక్రియలు నిర్వహించాడు.

మన కుటుంబంలోని మనిషి మాదిరిగా మన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టింది కాబట్టి మనుషులకు చేసే విధంగా ఆచారాలన్నింటిని ఈ కోడి పుంజుకి నిర్వహిద్దాం అని తన తండ్రి చెప్పడంతో ఇలా చేశాం అని చెబుతున్నాడు అభిషేక్‌. ఆ కోడిపుంజు ఆత్మకు శాంతి చేకూరాలంటూ పెద్ద ఎత్తున దశదిన కర్మ నిర్వహించింది ఆ కుటుంబం. పైగా ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది దాక హాజరవ్వడం విశేషం. 

(చదవండి: రోబోటిక్‌ డాగ్‌ ... సైనికుడిలా కాల్పులు జరుపుతోంది)

మరిన్ని వార్తలు