రు. కోటి పెట్టి నిర్మించిన రోడ్డు.. కొబ్బరికాయ దెబ్బకు బీటలు

3 Dec, 2021 19:30 IST|Sakshi

ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకున్న సంఘటన

లక్నో: మన దగ్గర రోడ్లు, ప్రాజెక్ట్‌ల నిర్మాణం ఎంత అధ్వానంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయా నిర్మాణాల నాణ్యత సదరు కాంట్రాక్టర్‌ ఎంత నిజాయతీపరుడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోటి రూపాయలు పెట్టి నిర్మించిన రోడ్డు ఒపెనింగ్‌ రోజునే దాని నాణ్యత ఎలా ఉందో బట్టబయలు అయ్యింది. రోడ్డు ఒపెనింగ్‌లో భాగంగా కొబ్బరి కాయ కొట్టడానికి ప్రయత్నించగా.. అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కొబ్బరి కాయ బదులు రోడ్డు బీటలు వారింది. ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ వివరాలు.. 
(చదవండి: చిలక కాదు.. మొలక: ఆసక్తిగా తిలకిస్తున్న జనం )

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ బిజ్నోర్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వం 1.16 కోట్ల రూపాయల ఖర్చుతో 7 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మించింది. రహదారి ప్రారంభోత్సవానికి బిజ్నోర్‌, సదార్‌ నియోజకర్గ బీజేపీ ఎమ్మెల్యే సుచి మౌసం చౌదరీని ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పూజ చేసి.. కొబ్బరి కాయ కొట్టి.. రోడ్డును ప్రారంభిద్దామని భావించారు. అయితే కొబ్బరి కాయ పగలలేదు కానీ.. రోడ్డు మాత్రం బీటలు వారింది.
(చదవండి: అద్భుతం.. ఇంటి మేడ మీద 4 వేల మొక్కలు)

ఈ సంఘటనపై మౌసం చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారులు వచ్చి.. నమూనాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. మూడు గంటలు నిరీక్షించిన తర్వాత అధికారులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆమె తారు నమూనాను సేకరించడంలో అధికారులకు సహాయం చేయడానికి గాను ఆ ప్రదేశంలో తవ్విన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్నాయి. 

చదవండి: ‘ఛ ఛ.. నీవల్లే ఇన్ని నేర్చుకున్నాను’

మరిన్ని వార్తలు