అమానవీయం.. విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చోబెట్టిన పాఠశాల యాజమాన్యం

18 Oct, 2022 18:07 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చోబెట్టింది యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాల్ విద్యా మందిర్ అనే ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఫీజు కట్టనందుకు టీచర్లు తమను రోజంతా ఎండలోనే కూర్చోబెట్టారని ఓ విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. పరీక్షలు కూడా రాయనివ్వలేదని వాపోయింది. ఫీజు విషయంపై తల్లిదండ్రులకు చెప్పానని, వారు ఒక్కరోజులో చెల్లిస్తామన్నారని పేర్కొంది. ఈ విషయం టీచర్లకు చెప్పినా వినిపించుకోకుండా తమకు ఈ శిక్ష విధించారని రోదించింది.

పిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను రోజంతా ఎండలో కూర్చొబెట్టిన పాఠశాల యాజమాన్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం ఏమేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి.
చదవండి: క్షమాపణలు చెప్పు.. లేదా 'లై డిటెక్టర్' పరీక్షకు రా..

మరిన్ని వార్తలు