మోదీ జీ సాయం చేయండి అంటూ... మహిళ లేఖ

30 Aug, 2022 16:58 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌ జిల్లాలోని సంగీత శర్మ అనే  మహిళ భర్త కోసం ప్రధాని మోదీని, విదేశాంగ మంత్రిని సాయం చేయమని అభ్యర్థించింది. ఆమె తన భర్త అనారోగ్యంతో దక్షిణాఫ్రికాలో మృతి చెందాడని, ఆయన మృతదేహాన్ని భారత్‌కి రప్పించేందుకు సాయం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సంగీతా శర్మ ఉత్తరప్రదేశ్‌లోని భాయ్లా గ్రామ నివాసి. 

ఆమె తన భర్త మనోజ్‌ కుమార్‌ మృతదేహాన్ని తిరిగి రప్పించేందుకు తన వద్ద తగినంత డబ్బులేదంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసిందని సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సూరజ్‌ రాయ్‌ తెలిపారు. మనోజ్‌ కుమార్‌ దక్షిణాఫ్రికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నడని, ఆగస్టు 27న అనారోగ్యంతో మృతి చెందాడని చెప్పారు. అంతేకాదు జిల్లా మేజిస్ట్రేట్‌ అఖిలేష్‌ సింగ్‌ సబ్‌ డివిజనల్‌ దేవబంద్‌ దీపక్‌ కుమార్‌ను ఆ మహిళకు సాయం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఐతే సంగీతశర్మ అంగన్‌ వాడి కార్యకర్త అని ఆమె పిల్లలు కూడా చాలా చిన్నవాళ్లని పోలీస్‌ అధికారి చెప్పుకొచ్చారు. 

(చదవండి: విధిరాత అంటే ఇదేనేమో! టైంకి ఆస్పత్రికి తరలించిన...ఓపెన్‌ కానీ అంబులెన్స్‌ డోర్‌లు)

మరిన్ని వార్తలు