‘బరాత్‌’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌

27 Apr, 2021 16:47 IST|Sakshi

డెహ్రాడూన్‌: ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణతో అంబులెన్స్‌లు విరామమెరుగక సంచరిస్తున్నాయి. దీంతో ఆ వాహనాల డ్రైవర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారంతా పీపీఈ కిట్లు ధరించి సేవల్లో మునిగారు. ఈ సమయంలో కాస్తంతా సమయం దొరికినా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ చేసిన పని వారు ఎంత కష్టపడుతున్నారో అర్ధమవుతోంది. వారు ఎలాంటివి కోల్పోతున్నారో తెలుస్తోంది. వారి దయనీయ స్థితి నెటిజన్లను ఆవేదనకు గురి చేస్తోంది.

ఉత్తరాఖండ్‌ హల్ద్వానీ పట్టణంలో ఓ కళాశాల వద్ద కొద్ది మందితోనే పెళ్లి బరాత్‌ కొనసాగుతోంది. ఈ సమయంలో అటువైపు వచ్చిన అంబులెన్స్‌తో వచ్చిన డ్రైవర్‌ మహేశ్‌ వాహనం ఆపేశాడు. వెంటనే పీపీఈ కిట్‌లోనే బరాత్‌ మధ్యలోకి వచ్చి తీన్మార్‌ స్టెప్పులేశాడు. మ్యూజిక్‌ అనుగుణంగా స్టెప్పులేస్తూ తన పని ఒత్తిడిని మరిచేలా అలసిపోయేలా డ్యాన్స్‌ చేశాడు. అయితే అకస్మాత్తుగా ప్రత్యక్షమైన పీపీఈ కిట్‌ డ్రైవర్‌ను చూసి పెళ్లివారు ఆందోళన చెందారు. అనంతరం ఆ డ్రైవర్‌ ఆనందంతో డ్యాన్స్‌ చేస్తుండడంతో అతడిని వారించకుండా ఎగరనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రోగులకు నిరంతరం సేవలందిస్తూ బిజీగా ఉన్న వ్యక్తి ఇలా కష్టాన్ని మరుస్తూ సంతోషంగా చిందేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు