డెహరాడూన్‌లో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులు 

11 Dec, 2020 15:28 IST|Sakshi

మొట్టమొదటగా ఎలక్ర్టిక్ బస్సులను ప్రవేశపెట్టిన ఒలెక్ట్రా 

సాక్షి, న్యూఢిల్లీ: డెహరాడూన్ పౌరులు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్‌తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు. ఈ బస్సులను దేశంలో ఎలక్ర్టిక్ ప్రజా రవాణా వ్యవస్థలో అగ్రగామి అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ అందిస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి  త్రివేది సింఘ్ రావత్ శుక్రవారం ఈ బస్సులకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రావత్ మాట్లాడుతూ “ఈ సంవత్సరంలో 30 ఎకో ఫ్రెండ్లీ బస్సులను ప్రారంభించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ఈ బస్సులు డెహరాడూన్, ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్ కొండ ప్రాంతాల్లో కూడా తమ ప్రయాణాన్ని సాగిస్తాయని" తెలిపారు. (చదవండి: కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా)

తొమ్మిది మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 25 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో హైడ్రాలిక్ వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్‌ ఉంటుంది. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ (Li-ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధుని  సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్‌ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 3 నుంచి 4 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది.(చదవండి: లాజిస్టిక్స్‌ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్‌)

ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ, దేశంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను మరో రాష్ట్రంలో కూడా నడపడం చాలా గర్వంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్ జీవావరణాన్ని సంరక్షించడంలో భాగం ఈ ఎలక్ట్రిక్ బస్సులు తమ వంతు పాత్ర పోషిస్తాయన్నారు. సమర్థవంతమైన విద్యుత్ ప్రజా రవాణా వ్యవస్థతో కాలుష్యాన్నితగ్గించే కృషిలో ఒలెక్ట్రా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఉత్తరాఖండ్ లో కూడా ప్రవేశపెట్టిన ఈ 30 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా తమ సేవలు అందిస్తాయని తెలిపారు. ఇప్పటికే ముంబాయి, పూణె, నాగ్ పూర్, హైదరాబాద్, కేరళలో తాము అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే తమ ప్రామాణికతను సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.

ఒలెక్ట్రా కంపనీ ఇప్పటికే వివిద రాష్ట్రాలలో 280 బస్సులను సరఫరా చేసింది. దేశ రహదారులపై పౌర రవాణా వ్యవస్థలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే 2 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాయి. CO2 ఉద్గారాలను 13000 టన్నుల మేరకు తగ్గించింది. ఇది లక్ష చెట్లు నాటాడానికి సమానం. మనాలి నుండి రోహ్తాంగ్ పాస్ వరకు ఎత్తైన కొండల్లో కూడా ఒలెక్ట్రా బస్సులు ప్రయాణం సాగిస్తున్నాయి. ఒలెక్ట్రా కంపనీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదయింది. ఎలక్ర్టిక్ బస్సు నిర్మాణ రంగంలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది అలాగే FAME-II లో భాగంగా మంజూరు చేసిన 5595 బస్సుల్లో 20 శాతం మేరకు ఒప్పందాలను సాధించింది. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి  విజయ రూపాణి రేపు (శనివారం) ఒలెక్ట్రా ఎలక్ర్టిక్ బస్సుల ట్రయల్ రన్ కు సూరత్ లో ప్రారంభించనున్నారు. 

సూరత్ మునిసిపల్ కార్పోరేషన్ కు ఒలెక్ట్రా కంపనీ 150 ఎలక్ర్టిక్ బస్సులను దశల వారీగా సరఫరా చేయనుంది. అలాగే సిల్వాసా కు కూడా 25 ఎలక్ర్టిక్ బస్సులను అందిస్తుంది. వీటి ట్రయల్ రన్ వచ్చే వారం చేయబోతున్నారు. ఫేమ్‌-II లో భాగంగా వివిధ రాష్ట్రాలకు 775 ఎలక్ర్టిక్ బస్సులను ఒలెక్ట్రా దశల వారీగా అందించనుంది.  ఎంఈఐఎల్‌ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 2000లో స్థాపించబడింది. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపనీ. 2015లోనే దేశంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంస్థ కావడం విశేషం.

మరిన్ని వార్తలు