204 మంది మిస్సింగ్‌.. ఇద్దరు బతికారు

12 Feb, 2021 15:34 IST|Sakshi

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో ధౌలిగంగా నది సృష్టించిన జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. కాగా, ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం సంభవించి 6రోజులు ముగుస్తున్నాయి. ఎన్‌టీపీసీ హైడల్‌ ప్రాజెక్టు తపోవన్ సొరంగంలో చిక్కుకున్నవారికోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.  అయితే తాజాగా ఈ ఘటనలో ఇద్దరు సజీవంగా బయట పడ్డారు.

ఇప్పటికే  204 మంది తప్పిపోయారు. టన్నెల్‌ చిక్కుకున్న మరికొందరితో సంబంధాలు ఏర్పర్చుకోవడానికి అనేక ఏజెన్సీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తపొవన్‌ సొరంగంవద్ద సహయక చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు చమోలి జిల్లా కలెక్టర్‌ స్వాతి భదోరియా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇదిలా ఉండగా.. ఈ భయానక విపత్తుకు అందరూ భావించినట్లు హిమనీనదం పేలుడు కారణం కాదని రైనీ గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాక వారు మరో సంచలన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

56 ఏళ్ల కిందట అధికారులునందాదేవి శిఖరంపై ఓ రేడియో యాక్టివ్ (రేడియోధార్మిక పదార్థం) పరికరాన్ని ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత ఆ పరికరం మిస్సైందని తెలిపారు. తాజా పేలుడుకు ఆ పరికరమే కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు