కోవిడ్‌ ఎఫెక్ట్‌: ఉత్తరాఖండ్‌లో కర్ఫ్యూ పొడిగింపు

6 Sep, 2021 21:09 IST|Sakshi

డెహ్రడూన్‌: కరోనా మూడో వేవ్‌ విజృంభిస్తుండటంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కర్ప్యూను సెప్టెంబర్‌ 14(మరోవారం) వరకు పొడిగించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం గతంలో విధించిన కర్ఫ్యూ సమయం సెప్టెంబర్‌ 7న ముగుస్తుండటంతో.. దాన్ని మరో వారం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌ కట్టడిలో భాగంగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం గతనెలలో రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, వినోద సమావేశాలను నిషేధించిన సంగతి తెలిసిందే. (చదవండి: మంత్రి గారు మాస్క్‌ ముఖానికి పెట్టుకోవాలి, అక్కడ కాదు..!)

కర్ఫ్యూ అమలవుతున్నప్పటికి వ్యాక్సిన్‌లు వేయడం యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కర్ఫ్యూ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు ఉదయం 8 గంటలు నుంచి రాత్రి 9 గంటలు వరకు మాత్రమే పనిచేసేలా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

చదవండి: మంచు నిండిన ఈ ప్రదేశానికి పచ్చిక భూమి అనే పేరేంటో!

మరిన్ని వార్తలు