ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్‌ మహీంద్ర

28 Nov, 2023 20:43 IST|Sakshi

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్ వారిని ఒక్కొక్కరినీ బయటికి తీసుకువచ్చారు. దీంతో అక్కడంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు మంగళవారం (నవంబరు 28) తొలిసారి వెలుగు ముఖం చూశారు.

బయటకు తీసుకొచ్చిన వారిని అత్యవసర వైద్య పరీక్షల  నిమత్తం ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. దీనిపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. 423 గంటలు, 41 జీవితాలు!!! రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు!! అంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పరిశీలించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సిల్క్యారా సొరంగం లోపల నుండి  బైటికి వచ్చిన కార్మికులను కలిసి ఆనందం ప్రకటించారు. 

(ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్‌ కారిడార్‌)

ముఖ్యంగా ఆనంద్‌ మహీంద్ర  ఈ ఆపరేషన్‌పై సక్సెస్‌పై  స్పందించారు.  41 మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు గత 17 రోజులుగా అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడా విజయం సాధించగలిగే దానికంటే గొప్పగా,  దేశ స్ఫూర్తిని  ఇనుమడింప చేశారు. మా ఆశల్ని ద్విగుణీ కృతం చేశారని పేర్కొన్నారు. మన ఆశయం, కృషి కలెక్టివ్‌గా ఉంటే, ఐక్యంగా ఉంటే ఏ సొరంగం నుండి బయటపడటం  కష్టం కాదు, ఏ పని అసాధ్యం కాదని  మరోసారి గుర్తు చేసారు అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. (ఉత్తరాఖండ్‌ టన్నెల్‌: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్)

మరిన్ని వార్తలు