కార్బెట్‌ రిజర్వ్‌లో తెల్ల నెమలి.. 85 ఏళ్లలో ఇదే తొలిసారి

23 Jun, 2021 12:41 IST|Sakshi

డెహ్రడూన్‌ నెమలి పురివిప్పి నాట్యం చేసిందంటే ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. మరి నెమలి అందం అలాంటిది. నీలం రంగు నెమలిలు కనిపించే స్థాయిలో తెల్ల నెమలిలు కనిపించడం అత్యంత అరుదు. తాజాగా ఉత్తరఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రడూన్‌లో ఓ తెల్ల నెమలి అటవీ సిబ్బందికి కనిపించింది. కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌లోని కోతి రౌ సమీపంలో ఆదివారం పెట్రోలింగ్‌కు వెళ్లిన అటవీ అధికారులలకు ఈ దృశ్యాలు కంటపడ్డాయి. వాస్తవానికి కార్బెట్‌ రిజర్వ్‌లో బ్లూ కలర్‌ నుంచి గ్రీన్‌ వరకు అన్ని రకాల నెమలిలకు నిలయం. కానీ అక్కడ ఇప్పటి వరకు ఒక్క తెల్ల నెమలి కూడా చూడలేదు.అయితే గత 85 సంవత్సరాల చరిత్రలో కార్బెట్‌ రిజర్వ్‌లో తెల్ల నెమలి కనిపించడం ఇదే తొలిసారి. 

దీంతో నిజంగా వారు చూసింది తెల్ల నెమలియేనా అని తెలుసుకునేందుకు మరుసటి రోజు అక్కడికి వెళ్లారు. మళ్లీ ఆ నెమలి తారసపడంతో నిర్ధారించుకున్నట్లు రిజర్వ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ తెలిపారు. అనంతనం జోన్‌లోని సిబ్బందిని అప్రమత్తం చేసి, ఇలాంటి నెమలిలు ఇంకా ఉన్నాయో లేవో గుర్తించేందుకు దాని కదలికలపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఇటీవల, కార్బెట్ అధికారులు పఖ్రో జోన్లో ఒక అల్బినో సాంబర్ జింకను, జిర్నా జోన్‌లో ఒక అల్బినో క్యాట్‌ఫిష్‌ను గుర్తించారు. ఈ క్రమంలో కార్పెట్‌లో ఇంకా అల్బినో పక్షులు, జంతువుల సంఖ్య ఉందో లేదో అన్న విషయాన్ని తెలుసుకోవాలని రాహుల్ పెట్రోలింగ్ సిబ్బందిని కోరారు.

కాగా, తెలుపు రంగు నెమలి ఒక ప్రత్యేక జాతి ఏంకాదు. నీలం రంగు నెమలిలోనూ మరో జన్యు రూపాంతరం.ఇందులో లూసిజం అనే జన్యు పరివర్తన ఉంటుంది. ఇది నెమలి పించాలపై వర్ణద్రవ్యం లేకపోవటానికి కారణమవుతుంది. ఈ విషయంపై డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఇది చాలా అరుదైన దృశ్యం. “నేను అడవిలో తెల్లటి పీఫౌల్‌ని ఎప్పుడూ చూడలేదు. ఇది మొదటిసారి’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు