వ్యాక్సిన్‌ కావాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి!

25 Apr, 2021 19:16 IST|Sakshi

న్యూఢిల్లీ: మే 1వ తేదీ నుంచి 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి కరోనా వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌ తీసుకోవాలంటే కచ్చితంగా కోవిన్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారు కొవిన్‌ వెబ్‌పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. కానీ, వారు ఆధార్‌ కార్డుతో నేరుగా వాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లినా వైద్య సిబ్బంది పేరు, వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.

దేశంలో కరోనా వైరస్ కేసుల భాగ పెరుగుతున్న నేపథ్యంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ మే 1 నుంచి టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాక్సిన్‌  కు డిమాండ్ పెరగడం వల్ల వాక్సినేషన్ కేంద్రల వద్ద జనాభా తాకిడి ఎక్కువవుతుంది కాబట్టి కోవిన్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసినట్లు ఒక అధికారి పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28 నుంచి కోవిన్ పోర్టల్‌, ఆరోగ్య సేతు యాప్‌లో ప్రారంభమవుతుంది. మరోవైపు వ్యాక్సిన్‌ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ప్రకటించగా, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్‌ అందించనున్నట్లు స్పష్టం చేశాయి.

చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి!

మరిన్ని వార్తలు