వ్యాక్సిన్ కోసం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

28 Apr, 2021 15:16 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కోసం భారతదేశం యువత ఎదురుచూస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా బారిన పడుతున్న కేసులలో యువత, మధ్య వయస్సు గలవారు వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు కోవిడ్-19 వల్ల మరణిస్తున్న వారిలో సైతం 20 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారే అధికంగా ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైడిన అందరికీ దేశ వ్యాప్తంగా కరోనా టీకాలకు అర్హులుగా ప్రకటించింది.

నేటి(ఏప్రిల్ 28) నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుంచే చాలా మంది యువత కోవిన్ యాప్, వెబ్‌సైట్‌లలో కోవిడ్19 టీకా రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తొలుత రిజిస్ట్రేషన్ సమయం చెప్పకపోవడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 28న(బుధవారం) సాయంత్రం 4 గంటల నుంచి కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ లలో కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సేతు అదికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 18 ఏళ్లు పైబడిన వారికి దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు మే 1 నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్19 టీకాల కోసం కొవిన్ యాప్, ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ ల ద్వారా ఆసక్తిగల వారు కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.

చదవండి: 

కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు