వీడియో:: వాజ్‌పేయి వర్ధంతి: రాజకీయ దురంధరుడికి ఘన నివాళి

16 Aug, 2022 08:18 IST|Sakshi

అటల్ బిహారీ వాజ్‌పేయి.. ముక్కుసూటి నిర్ణయాలతో రాజకీయ దురంధరుడిగా భారత రాజకీయాల్లో తనకంటూ ఒక చెరగని ఒక ముద్ర వేసుకున్నారు. రాజనీతిజ్ఞుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న అతికొద్ది మందిలో ఈయనొకరు.  సాహితి లోకానికి కవిగా,  దాదాపు ఆరేళ్లపాటు భారత దేశానికి ప్రధానిగా, బీజేపీ కీలకనేతగా, అశేష జనాదరణ ఉన్న ప్రముఖుడిగా గుర్తింపు ఉన్న వాజపేయి వర్ధంతి నేడు..

ఆగస్టు 16వ తేదీన అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్థంతి. ఈ సందర్భంగా.. ప్రముఖులంతా ఈ ఉదయం ఆయన సమాధి ఉన్న న్యూఢిల్లీ స్మారక స్థలం ‘సదైవ్ అటల్‌’ వద్ద నివాళులర్పించారు. మాజీ ప్రధాని సమాధి వద్ద..   రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్‌, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా.. పుష్పాలు ఉంచి నివాళి అర్పించారు. 

కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ తదితరులతో పాటు వాజ్‌పేయి దత్తత కూతురు నమితా కౌల్‌ భట్టాచార్య సైతం ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వాజ్‌పేయి చివరిసారిగా జనాలకు కనిపించింది ఎప్పుడంటే..

మరిన్ని వార్తలు