‘వందే సాధారణ్‌’ ట్రయల్‌ రన్‌

9 Nov, 2023 05:43 IST|Sakshi

విజయవంతం

ముంబై: రైల్వే శాఖ దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ‘వందే సాధారణ్‌’ రైలు ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. తొలి వందే సాధారణ్‌ రైలును బుధవారం ముంబై–అహ్మదాబాద్‌ మధ్య విజయవంతంగా నడిపినట్టు రైల్వే శాఖ పేర్కొంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌అవుతోంది. కొంతకాలం క్రితం ప్రవేశపెట్టిన వందేభారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో విజయవంతంగా నడుస్తుండటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం అదే తరహాలో ‘వందే సాధారణ్‌’ రైళ్లు తేవాలని రైల్వే శాఖ గతంలోనే నిర్ణయించడం తెల్సిందే. వందేభారత్‌ రైళ్లలో పూర్తిగా ఏసీ కోచ్‌లు ఉండగా ‘వందే సాధారణ్‌’ నాన్‌ ఏసీ కోచ్‌లతో నడవనున్నాయి. వీటిలో మొత్తం 22 స్లీపర్, జనరల్‌ బోగీలు ఉంటాయి. రెండువైపులా ఇంజన్లుండటం వీటి ప్రత్యేకత. సీసీటీవీ నిఘా, సెన్సార్‌ ఆధారిత సౌకర్యాలు, తదితర సదుపాయాలను ఈ కోచ్‌లలో కలి్పంచనున్నారు.

ఒక్కో రైలులో 1,800 మంది దాకా ప్రయాణించవచ్చు. ఇవి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని రైల్వే శాఖ చెబుతోంది. దేశంలో 500 కిలోమీటర్లు దాటిన ప్రఖ్యాతిగాంచిన పలు మార్గాల్లో ఈ కొత్తతరహా రైలు సరీ్వసులను ప్రారంభించాలని రైల్వేశాఖ యోచిస్తోందని సమాచారం. ముంబై– న్యూఢిల్లీ, పటా్న–న్యూఢిల్లీ, హౌరా–న్యూఢిల్లీ, హైదరాబాద్‌–న్యూఢిల్లీ, ఎర్నాకులం–గువాహటి మార్గాలు ఈ రూట్‌ల జాబితాలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు