జ్ఞానవాపి కేసు: తీర్పు వాయిదాతో కొనసాగనున్న ఉత్కంఠ!

8 Nov, 2022 13:36 IST|Sakshi

వారణాసి: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉత్తర ప్రదేశ్‌ వారణాసి జ్ఞానవాపి కేసులో ఇవాళ(నవంబర్‌ 8, మంగళవారం) కీలక తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్లపై తదుపురి విచారణను నవంబర్‌ 14 తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. 

మసీదు ప్రాంగణంలో ఉన్న శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలని, హిందువులకు ఆ ప్రాంగణం అప్పగించాలని, అలాగే ముస్లింల ప్రవేశాన్ని నిషేధించేలా ఆదేశాలు ఇవ్వాలని.. మొత్తం మూడు డిమాండ్లతో కూడిన హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ మేరకు సివిల్‌ జడ్జి(సీనియర్‌ డివిజన్‌) మహేంద్ర పాండే తీర్పును అక్టోబర్‌ 27న రిజర్వ్‌ చేసి ఉంచారు. 

ముందుగా నవంబర్‌ 8వ తేదీన తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే జడ్జి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో నవంబర్‌ 14వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతానికి ముస్లిం వర్గాలకు అక్కడ నమాజ్‌కు అనుమతి ఇస్తున్నారు. 

ఇక.. గత విచారణ సందర్భంగా వాజుఖానాలో ఉన్న శివలింగం అంశంపై సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌కు అనుమతించాలని, కార్బన్‌ డేటింగ్‌ చేయించాలనే అభ్యర్థనను వారణాసి కోర్టు తోసిపుచ్చింది. ఇక ఆ ఆకారం శివలింగం కాదని, ఫౌంటెన్‌ భాగమని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. మసీదు నిర్వహణను చూసుకుంటున్న ఏఐఎంసీ.. హిందు సంఘాల తరపున పిటిషన్‌ వేసిన వీవీఎస్‌ఎస్‌ వాదనను తోసిచ్చుతోంది.

ఇదీ చదవండి: కర్మ అంటే ఇదేనేమో.. దెబ్బకు తిక్క కుదిరింది!

మరిన్ని వార్తలు