ప్రధాని మోదీకి ఊహించని షాక్‌.. ఒవైసీకి మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ

13 Jun, 2022 20:26 IST|Sakshi

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌కు భారీ షాక్‌ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన ఎంపీ.. సొంత పార్టీ బీజేపీపైనే సంచలన విమర్శలు చేశారు. దీంతో దేశంలోనే ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

వివరాల ప్రకారం.. యూపీలోని పిలిభిత్‌ నియోజకవర్గ బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ.. కేంద్రానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై కీలక వ్యాఖ‍్యలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగం గత మూడు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నదని కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 

భారత్‌లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉందంటూ.. ప్రస్తుతం ఇదే దేశంలో బర్నింగ్‌ ప్రాబ్లమ్‌ అంటూ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగితేనే  దేశం శక్తివంతం అవుతుందని కుండబద్దలుకొట్టారు. ఒక వైపు ఉద్యోగాలు లేక దేశంలోని కోట్ల మంది యువత నిరుత్సాహంలో మునిగి ఉన్నారని అన్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఇదిలా ఉండగా.. కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్‌ ఎక్కడకు వెళ్లింది? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరీ ఈ విషయం తెలుసుకునే హక్కు ఉందని ఘాటు వ్యాఖ‍్యలు చేశారు. అయితే, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీ కొద్దిరోజుల కిత్రం పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలను వెల్లడించారు. ఈ సందర్బంలో తాను చదవి వినిపించిన డేటా తనది కాదని.. బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీదని తెలిపారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి తన డేటాను చదవి వినిపించిన అసదుద్దీన్‌ ఒవైసీకి వరణ్‌ గాంధీ కృతజ్ఞతలు చెప్పారు. 

ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగిపై అసదుద్దీన్‌ ఒవైసీ షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు