టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్ పర్సన్ గా ప్రశాంతి రెడ్డి ప్రమాణం..

10 Nov, 2021 11:08 IST|Sakshi

న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహామండలికి చైర్‌పర్సన్‌గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర భారతదేశంలో టీటీడీ ఆలయాల అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమాంలో టీటీడీ చైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలయ గర్భగుడిని అలాగే ఉంచి.. మిగిలిన ప్రాంతాన్ని పునర్‌నిర్మిస్తామని పేర్కొన్నారు. అయోధ్యలో టీటీడీ ఆలయంలో గానీ, భజన మండలి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలోని 29 పీఠాధిపతులతో తిరుమలలో గోమహా సమ్మేళనం నిర్వహిస్తామ​ని సుబ్బారెడ్డి తెలిపారు.

గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అన్నారు. దేశంలోని ఏ గుడిలో నైనా.. గోవును అడిగితే ఉచితంగా అందజేస్తామని తెలిపారు. దేశంలో అనేక చోట్ల గోవులకు సరైన పోషణ ఉండటం లేదని ఆవేదన సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. గోసంరక్షణ కోసం అవసరమైన నిధులను కూడా.. టీటీడీ కేటాయిస్తుందని టీటీడీ చైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు