రైతు బిడ్డ‌గా గ‌ర్విస్తున్నా: వెంక‌య్య నాయుడు

7 Aug, 2020 16:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : క‌రోనా మ‌హ‌మ్మారి క‌ష్ట‌కాలంలో అన్నదాత‌లు పోషించిన పాత్ర గొప్ప‌ద‌ని ఉప‌రాష్ర్ట‌ప‌తి వెంకయ్యనాయుడు కొనియాడారు.  రైతుల అంకితభావం, చిత్తశుద్ధి కారణంగానే ఆహార భద్రతకు సమస్యరాలేద‌ని తెలిపారు. అంతేకాకుండా గ‌త సంవ‌త్స‌రం కంటే ఎక్కువ‌గానే దేశంలో  ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింద‌ని తెలిపారు. శుక్ర‌వారం ఎం.ఎస్ స్వామినాథ‌న్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో భార‌త్‌తో పాటు  ప్రపంచంలోని వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన ‘సైన్స్ ఫర్ రెజిలియంట్ ఫుడ్,న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్స్’ సదస్సును వెంక‌య్య నాయుడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ..భారతీయ అన్నదాతల శక్తిసామర్థ్యాలు, అంకితభావం, సంప్రదాయ వ్యవసాయపద్ధతులపై వారికున్న పరిజ్ఞానం అభినంద‌నీయ‌మ‌ని ప్ర‌శంసించారు. వారి కృషికి రైతులంద‌రికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా.. రైతు బిడ్డగా ఇందుకు గర్విస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. (‘న్యాయ‌స్థానాల్లో పెండింగ్ కేసులు 3 కోట్ల‌కు పైగానే’ )

భార‌తీయ సంప్ర‌దాయ వ్య‌వ‌సాయ పరిజ్ఞానానికి ఆధునిక సాంకేతికత, శాస్త్ర పరిశోధనలు తోడైతే భారతదేశం మరింత పురోగతి సాధిస్తుందన్నారు. ఆహారంలోని పోషకాహార విలువలను పొందే విధంగా ప్రాసెసింగ్ పద్ధతులపై దృష్టిపెట్టడంతోపాటు ఆహారధాన్యాల నిల్వల సామర్థ్యాన్ని  కూడా పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయ‌న సూచించారు. ఎంఎస్ స్వామినాథ‌న్ ఫౌండేష‌న్ ద్వారా పురుషుల‌తో పాటు మ‌హిళ‌ల‌ను స‌మానంగా ప్రోత్స‌హించ‌డం గొప్ప‌విష‌య‌మ‌ని అన్నారు.

 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే క్రమంలో మరింత ప్రగతి జరగాల్సిన అవసరం ఉంని..ఆకలి, పౌష్టికాహారలోపం, శిశు మరణాల రేటు తగ్గించే విషయంలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించిందని కొనియాడారు. నూతన విద్యావిధానంలో.. పాఠశాలల్లో చిన్నారులకు చక్కటి పోషకాహార అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎం. ఎస్ స్వామినాథ‌న్‌తో పాటు శ, విదేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. (మానవ తప్పిదమే; బీరూట్‌ పోర్టు డైరెక్టర్‌ అరెస్ట్‌)


 

మరిన్ని వార్తలు