దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది

5 Sep, 2020 09:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివద్ధికి పునాది పడుతుందని  ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు  పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సమావేశ ప్రాంగణంలో..‘స్టేట్‌ ఆఫ్‌ యంగ్‌ చైల్డ్‌ ఇన్‌ ఇండియా’ పుస్తకాన్ని ఆన్‌లైన్‌ వేదిక ద్వారా వెంకయ్యనాయుడు  ఆవిష్కరించారు.

పుస్తకంలో ప్రస్తావించిన పలు అంశాలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. ‘భారతదేశంలో 15.9 కోట్ల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఇందులో 21 శాతం మందిలో పోషకాహారలోపం, 36శాతం మంది తక్కువ బరువుతో ఉండగా.. 38 శాతం మందికి టీకాలు అందడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ అంకెలు.. చిన్నారులతోపాటు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. (యువత సమస్యలపై ప్రభుత్వానికి నిజాయితీ లేదు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు