ప్రముఖ గాయని జగ్జీత్‌ కౌర్‌ కన్నుమూత

15 Aug, 2021 18:18 IST|Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నేపథ్య గాయని జగ్జీత్‌ కౌర్‌ (93) అనారోగ్యం కారణంగా ఈరోజు (ఆదివారం) ముంబైలో మృతిచెందింది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యల  కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జగ్జీత్‌ కౌర్‌ ఈరోజు ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ముంబైలోని ఎస్‌విరోడ్‌లోని వైల్‌పర్లేలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జగ్జీత్‌ కౌర్‌, బజార్‌ సినిమాలో దేఖ్‌లో ఆజ్‌ కా హుమ్‌కో, షోలా అవుల్‌ శబ్నం సినిమాలోని ఆఖేమిలనా.. పాటలకు స్వరం అందించారు.

కౌర్‌భర్త.. మహమ్మద్‌ ఖయ్యం ప్రముఖ మ్యూజిక్‌ కంపొసర్‌. ఆయన 1954లో జగ్జీత్‌ను వివాహం చేసుకున్నారు. ఖయ్యం.. త్రిషుల్‌,నూరీ, శోలా అవుల్‌ శబ్నంలకు కంపోసింగ్‌ చేశారు. ఆయన ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్‌ వలన  2019లోనే ముంబైలో మరణించారు. 17 ఏళ్ల వయసులో సంగీత రంగంలో ఖయ్యం అడుగుపెట్టారు. కాగా, సంగీత రంగంలో ఆయన చేసిన సేవలకు గాను.. సంగీత నాటక అకాడమి నుంచి పద్మభూషణ్‌, నేషనల్‌ అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నారు. 

మరిన్ని వార్తలు