టైమ్స్‌ నౌ జాబితాలో విజయ్‌ దేవరకొండ

22 Aug, 2020 15:55 IST|Sakshi

ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా  'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా' పోటీని నిర్వహించింది. దీనిలో భారతీయ చిత్ర సీమకు చెందిన హీరోలతో పాటు క్రికెట్‌ స్టార్‌ల వరకు అవకాశం కల్పించింది. 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారి జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచి వీరిలో మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌కు ఆన్‌లైన్‌ ద్వారా ఓట్లు వేయాలని కోరింది. ఈ జాబితాలో టాలీవుడ్‌ నుంచి అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ ఇంకా మరికొంత మంది హీరోలు కూడా ఉన్నారు. తమిళ, కన్నడ ఇలా సౌత్‌ ఇండియాకు చెందిన స్టార్లు నివీన్‌ పౌలీ, దుల్కర్‌ సల్మాన్‌ కూడా ఉన్నారు. ఇక క్రీడల విషయానికి వచ్చే సరికి విరాట్‌కొహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ వంటి వారు కూడా ఉన్నారు.  

ఈ జాబితాలో బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌లు మొదటి, రెండవ స్థానాలలో నిలిచారు. మూడో స్థానంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు. ఈ జాబితాలోని టాప్ 10లో టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ మాత్రమే ఉండటం గమనార్హం. విజయ్‌ దేవరకొండకు తప్ప మరే తెలుగు హీరో టాప్ 10లో స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. ఇటీవల కాలంలో నోటా, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ లాంటి వరుస పరాజయాలను చవిచూసినప్పటికి విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ ఏమాత్రం తగ్గనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ఫైటర్‌ సినిమాలో  నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

చదవండి: విజయ్‌ @ 80 లక్షలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా