Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌ విజయం

6 Aug, 2022 19:52 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ ఘన విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థి అయిన ధన్‌కర్‌కు 528 ఓట్లు వచ్చాయి. అలాగే యూపీఏ అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 15గా తేలింది.

భారత దేశపు 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ ఎన్నికయ్యారు. శనివారం(ఆగస్టు6న) ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ జరగ్గా.. సాయంత్రం నుంచి కౌంటింగ్‌ మొదలైంది. ధన్‌కర్‌ గెలుపును అధికారికంగా ప్రకటించారు లోక్‌ సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌. 

మొత్తం 780 ఎలక్టోర్స్‌లో 725 మంది మాత్రమే ఓటు వేశారని, ఓటింగ్‌ శాతం 92.94గా నమోదు అయ్యిందని లోక్‌ సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఇందులో అధికార పక్ష అభ్యర్థి ధన్‌కర్‌  528 ఓట్లు సాధించారని, విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌కు 182 ఓట్లు దక్కాయని ఆయన వెల్లడించారు. చెల్లని ఓట్లు 15గా ఉందని, ఎన్నికలో 346 ఓట్ల తేడాతో ధన్‌కర్‌ గెలిచినట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి: జగదీప్‌ ధన్‌కర్‌.. మారుమూల పల్లెలో ‘రైతు బిడ్డ’ నుంచి ఉపరాష్ట్రపతి దాకా!

మరిన్ని వార్తలు