Video: ఏకంగా రైల్వే ప్లాట్‌ఫామ్‌ మీదకు ఆటో.. తరువాత ఏం జరిగిందంటే.

16 Oct, 2022 17:41 IST|Sakshi

మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్‌లో ఓ ఆటో డ్రైవర్‌ తన వాహనంతో రైల్వేస్టేషన్‌లోకి వచ్చాడు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆటో డ్రైవర్‌ ఏకంగా ఏకంగా తన ఆటోను ప్లాట్‌ఫామ్‌ మీదకే పోనిచ్చాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ వీడియో చివరికి రైల్వే పోలీసులు దృష్టికి చేరింది. దీంతో వారు ట్విటర్‌ ద్వారా వివరణ ఇచ్చారు.

కుర్లా రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ మీదకు ఆటో తీసుకొచ్చిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే యాక్ట్‌ ప్రకారం నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం జరగ్గా.. తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫన్నీగా కామెంట్‌ పెడుతుంటే మరికొందరు రైల్వే అధికారులను తీరును తప్పబడుతున్నారు. ఆటో ఏకంగా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేదాక రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని మండిడుతున్నారు.

మరిన్ని వార్తలు