కారుకు దెయ్యం పట్టిందా ఏంటి?!

14 Oct, 2020 11:38 IST|Sakshi

చెన్నై: అమెరికాకు చెందిన టెస్లా తన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉంది. అయితే ఈ సాంకేతికత అప్పుడే భారత్‌లో ప్రవేశించింది. తమిళనాడు రోడ్ల మీద సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు షికారు చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఈ వీడియోలో ప్రీమియర్‌ పద్మిని అని పిలవబడే ఫియట్‌ కారు డ్రైవర్‌ లేకుండా రోడ్డు మీద ప్రయాణిస్తుంది. మాస్క్‌ వేసుకున్న ఓ వ్యక్తి ప్యాసింజర్‌ సీటులో ఉండగా.. డ్రైవర్‌ కూర్చునే స్థానం ఖాళీగా ఉండటం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఫియట్‌ కారు ఎంతో నేర్పుగా ఇతర వాహనాలను అధిగమించడమే కాక సందులు, మలుపుల్లో చక్కగా వెళ్తుంది. దీని పక్కనే మరో వ్యక్తి వేరే వాహనంలో ఫాలో అవుతూ ఈ కారు షికారును వీడియో తీశాడు. తర్వాత దాన్ని ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. ‘ఇది ఎలా సాధ్యంమవుతుంది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: తంతే రైలు అయినా వెనక్కి వెళ్లాల్సిందే!)

‘కారుకు దెయ్యం పట్టిందా ఏంటి?’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజనులు. మరి కొందరు మాత్రం ఈ ఫీట్‌ వెనక రహ్యస్యాన్ని చేధించారు. ఈ కారు టూ వే పెడల్‌ సిస్టమ్‌ మోడల్‌ది అయి ఉంటుంది. అలాంటి కార్లలో రెండు వైపులా పెడల్స్‌ ఉంటాయి. వీటిని ఎక్కువగా డ్రైవింగ్‌ స్కూల్స్‌లో వినియోగిస్తారు. టీచర్‌ కూడా వాహనాన్ని నియంత్రించడానికి ఈ టూ వే పెడల్స్‌ మోడల్‌ కార్లని వాడతారు. ఇక్కడ కూడ అనుభవజ్ఞుడైన డ్రైవర్‌ ప్యాసింజర్‌ సీటులో కూర్చుని తన కూడి చేతితో స్టీరింగ్‌ని కంట్రోల్‌ చేస్తూ.. కారును నడుపుతున్నాడు అని తెలిపారు. మరి కొందరు ప్యాసింజర్‌ సీటులో కూర్చున్న వ్యక్తిని వెల్లూరు స్థానికుడిగా గుర్తించారు. అతడు చాలాసార్లు ఇలా ప్యాసింజర్‌ సీటులో కూర్చుని కార్‌ని డ్రైవ్‌ చేయడం తాము చూశామని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా