నిన్ను మించిన తోపులేడు.. డెలివరీ బాయ్‌ సాహసానికి మహిళా కస్టమర్‌ ఫిదా!

16 Sep, 2022 07:33 IST|Sakshi

ఓ ‍వ్యక్తి తన పని మీద ఉన్న డెడికేషన్‌ చూపించాడు. దీంతో రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో హీరో అయిపోయాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. కదులుతున్న రైలును సైతం చేజ్‌ చేసి ఓ కస్టమర్‌కు వస్తువును డెలివరీ చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. వివిధ రకాల వస్తువులను హోమ్‌ డెలివరీ అందించే డంజో ఏజెంట్‌ రన్నింగ్‌లో ఉన్న రైలు వెంట పరుగెత్తి మరీ తన కస్టమర్‌ ఆర్డర్ చేసిన వస్తువులను అందించాడు. కాగా, సదరు మహిళా కస్టమర్‌.. ఆ ఏజెంట్‌ అందించిన వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్టుగా ఆనందం వ్యక్తం చేశాడు. ఇక, ఈ ఘటన ముంబైలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ వీడియోలో డంజో డెలివరీ బాయ్ స్టేషన్‌లో పరుగెత్తుకుంటూ కనిపిస్తాడు. రైల్వే ఫ్లాట్‌ఫాంపై రైలు నెమ్మదిగా కదులుతోంది. క్రమంగా రైలు వేగం పెరిగింది. ఇంతలోనే డంజో డెలివరీ బాయ్ ఓ సంచితో పరుగెత్తుకుంటూ ఫ్లాట్ ఫాంపైకి వచ్చాడు. రైలులో డోర్‌ వద్ద నిలబడిన ఓ మహిళ.. డంజో డెలివరీ బాయ్‌ను ఫాస్ట్‌.. ఫాస్ట్‌ అంటూ చేతులతో సైగలు చేసింది. దీంతో, అతను రైలు వెంట వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి తన చేతిలోని ఆర్డర్‌ను సదరు మహిళకు అందించాడు. ఆమె దానిని చూపుతూ సంతోషం వ్యక్తం చేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడికి ప్రమోషన్‌ ఇవ్వాలని ఒకరు.. అతడికి 10 టైమ్స్‌ టిప్‌ ఎక్కువగా ఇవ్వొచ్చు అని మరొకరు కామెంట్స్‌ చేశారు.

మరిన్ని వార్తలు