ఉద్యోగం నుంచి పొమ్మన్న బాస్‌.. ప్రైవేట్‌ వీడియోతో ప్రతీకారం తీర్చుకున్న యువతి!

23 Sep, 2023 10:42 IST|Sakshi

పంజాబ్‌లోని జలంధర్‌లో అశ్లీల వీడియో వైరల్‌ అయిన ఉదంతం ఒకటి చోటుచేసుకుంది. ‍స్థానికంగా పిజ్జాషాప్‌ నిర్వహిస్తున్న ఒక జంటకు సంబంధించిన ప్రైవేట్‌ వీడియో వైరల్‌ అయిన నేపధ్యంలో దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ వీడియో ఫేక్‌ అని, దానిని ఎడిట్‌ చేశారని ఆ దంపతులు చెబుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ యువతి గతంలో ఇదే పిజ్జాషాపులో పనిచేసేది. ఆ యువతి యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇటువంటి పనిచేసిందని పోలీసులు తెలిపారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొన్ని నెలల క్రితం జలంధర్‌కు చెందిన ఒక జంట పిజ్జా షాప్‌ ప్రారంభించింది. అయితే ఇటీవల ఈ జంటకు సంబంధించిన ఒక ప్రైవేట్‌ వీడియో వైరల్‌ అయ్యింది. దీనిపై ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దుకాణదారు తమ ప్రైవేట్‌ వీడియోను ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి, రూ. 20 వేలు డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సొమ్ము ఇవ్వకపోతే వీడియో వైరల్‌ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య నాలుగు వీడియోలు వైరల్‌ చేశారని, వాటిలో ఒక వీడియో అభ్యంతరకరంగా ఉందని పోలీసులు తెలిపారు. 

ఈ ఉదంతంలో పోలీసులు ఒక యువతితోపాటు, ఒక అజ్ఞాత వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి నిర్మల్‌ సింగ్‌ మాట్లాడుతూ ఈ కేసులో నిందితురాలిని తనీషాగా గుర్తించామని, ఆమెను అరెస్టు చేశామని తెలిపారు. ఆమె గతంలో ఒక పిజ్జా షాపులో పనిచేసేదని, ఆమె పనితీరు నచ్చకపోవడంతో యజమాని ఆమెను పనిలో నుంచి తీసేశారని, దీంతో ఆమె యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి, ఆ దుకాణయజమాని దంపతులకు చెందిన ప్రైవేట్‌ వీడియో వైరల్‌ చేసిందని తెలిపారు. అలాగే రూ. 20 వేలు కావాలంటూ డిమాండ్‌ చేసిందన్నారు. కేసు దర్యాప్లు చేస్తున్నామని తెలిపారు.  
ఇది కూడా చదవండి: ‘ఎవ‌డ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’.. వంటలక్క చైనా తమ్ముడివా?

మరిన్ని వార్తలు