వీడియో: పోలీసుల చెంతకి ‘దెయ్యం’ వీడియోలు.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

26 Sep, 2022 21:26 IST|Sakshi

వైరల్‌: దెయ్యాల భయంతో ఆ ప్రాంతంలో స్థానికులు మాత్రం రాత్రిపూట వణికిపోతున్నారు. ఈ మేరకు వీడియోలు సైతం వైరల్‌ కావడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. 

వారణాసి(యూపీ) వీడీఏ కాలనీలోని బడీ గబీ దగ్గర తెల్ల ముసుగులో ఆకారాలు బిల్డింగ్‌ల మీద సంచరిస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అలా మూడు వీడియోలు రావడంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఈ వీడియోలు వాట్సాప్‌ ద్వారా పోలీసుల దాకా వెళ్లాయి. 

దీంతో ఆగంతకుల పనిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. వారణాసిలో అలాంటి ఘటనలేం జరగలేదని, అవసరమైన ప్రచారంతో ఆందోళన కలిగించొద్దని వీడియోలను వైరల్‌ చేస్తున్న వాళ్లను కోరారు డీసీపీ.

>
మరిన్ని వార్తలు